కామారెడ్డి, డిసెంబరు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామానికి చెందిన మెరుగు లాలయ్య గత రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆదివారం వారి కుటుంబానికి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సింలు గ్రామ అధ్యక్షులు నిజాం, మాజీ ఎంపీటీసీ గోవింద నాయక్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షకీల్, గిరిజన నాయకులూ, సర్దార్, రోవిన్, యువజన నాయకులు సిద్దు, రవి, ప్రశాంత్ కొక్కొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.