గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం అనీమియా వ్యాధితో బాధపడుతున్న అయేషా తబస్సుం (24) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా బి నేగిటివ్‌ రక్తం అవసరం కావడంతో పాల్వంచ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నవీన్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో 16వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, రక్తదానానికి యువతి యువకులు ముందుకు రావాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం, 15 రోజులకోసారి ప్లేట్‌లెట్స్‌ దానం చేసి ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత నవీన్‌కి, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా అధ్యక్షులు జతేష్‌ వి పాటిల్‌, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది చందన్‌,శ్రవణ్‌,వసీం అబ్దుల్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »