కామారెడ్డి, డిసెంబరు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ రేవంత్ రెడ్డి హిందీభాష పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడి తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఎంపి రేవంత్ రెడ్డి భాష మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ వెంటనే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా నిర్మల సీతారాం కేంద్ర మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.