కామారెడ్డి, డిసెంబరు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం న్యూట్రిషన్ కిట్ నిల్వ గదిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
జిల్లాకు 2000 న్యూట్రిషన్ కిట్లు మంజూరైనట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి తెలిపారు. కిట్లు నిల్వ ఉంచే స్టాళ్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చూశారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ లక్ష్మణ్ సింగ్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ శోభారాణి, వైద్యాధికారులు పాల్గొన్నారు.