బోధన్, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టీ యూ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మున్సిపాల్టి ల్లో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల వేతనం 19 వేల కనీస వేతనం చెల్లిస్తూ, దానిపైన 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలంటూ బోధన్ పట్టణం లోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మున్సిపల్ శాఖ మంత్రికి బోధన్ మున్సిపల్ కమిషనర్ ద్వారా వినతిపత్రం అందజేసినట్టు తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యూ) రాష్ట్ర నాయకులు బి. మల్లేష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వేతనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మున్సిపాల్టి ల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ కార్మికుల కు చేదు కబురే నని అన్నారు. ప్రస్తుతం వారు పొందుతున్న వేతనం 12వేల పైన 30 శాతం పెంచివ్వడం అంటే, పీ ఆర్సీ లో పేర్కొన్న కనీస వేతనం కన్నా తక్కువే నని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా మున్సిపాల్టి ల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల వేతనాలు 19 వేల కనీస వేతనం పై 30 శాతం పెంచి ఇవ్వాలని, ఎన్ ఎం ఆర్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, వారికి గతంలో ఇచ్చిన ప్రకారం ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఫీ ఎఫ్, ఈ ఎస్ ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో భూమన్న, ప్రభాకర్, మహేష్, శేఖర్, రాజు, విజయ్, పొశెట్టి, మరియమ్మ , రేణుక, పొశవ్వ తదితరులు పాల్గొన్నారు.