కామారెడి, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే నూతన విద్యా సంస్థలు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే కేవలం సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట మాత్రమే అభివృద్ధి జరుగుతుందని మిగిలిన జిల్లాలలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కామారెడ్డి పర్యటనకు వస్తున్న కెసిఆర్ నూతన విద్యా సంస్థలకు సంబంధించిన ప్రకటన చేయాలని, విద్యాసంస్థలు లేకపోవడంతో విద్యాపరంగా కామారెడ్డి జిల్లా వెనుకబడి ఉందని అన్నారు. నూతన విద్యా సంస్థలు వచ్చేంతవరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి లక్ష్మణ్ యాదవ్ బీసీ యువజన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెట్టబోయిన స్వామి, ఎన్ఎస్ యు ఐ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు సుధీర్, వేణు, చంద్రకిరణ్, శివ, శ్రీకాంత్ పాల్గొన్నారు.