కామారెడ్డి, డిసెంబరు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కామారెడ్డి మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి (34) మహిళలకు కాలు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
దీంతో పాల్వంచ గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్‌కి తెలియజేయగానే వెంటనే స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్తదానానికి ముందుకొచ్చిన రక్తదాత శ్రావణ్ కుమార్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జతేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వీ.టీ.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, నవీన్ తదితరులున్నారు.