నందిపేట్, డిసెంబరు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత ఆదివారం గోవింద్‌పెట్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్మల్ గ్రామానికి చెందిన ముగ్గురికి తీవ్రగాయలు కాగా అందులో మృతి చెందిన లక్ష్మీకి, గాయాలైన ఇద్దరికి మొత్తం కలిపి ఐదులక్షల రూపాయలను తెరాస యువజన విభాగం సీనియర్ నాయకుడు మల్యాల నర్సారెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు.
ఆర్మూర్ మండలం గోవింద్‌పెట్ వద్ద గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బైకు పైన ట్రిపుల్ డ్రైవింగ్ ఉండటంతో అదుపుతప్పి కారును బైక్ రాంగ్ రూట్లో డీకొంది. వెల్మల్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ముగ్గురు బైక్‌పై వెల్మల్ నుండి పచ్చలనడికుడ గ్రామానికి వెళ్తున్నారు. బైకు అదుపుతప్పి రాంగ్ రూట్లోకి వెళ్లి కారును ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ప్రశాంత్‌కు తీవ్ర గాయాలు కాగా పుష్పకు కాలు విరిగింది, లక్ష్మి అనే మహిళ తలకు తీవ్ర గాయాల పాలయ్యారు.
వీరిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. రోడ్డు ప్రమాదం త్రిబుల్ రైడిరగ్ బైక్ పై వస్తున్న వారు అదుపుతప్పి కారును ఢీకొట్టారు. కారు యజమాని తెరాస జిల్లా యువజన విభాగం సీనియర్ నాయకుడు మల్యాల నర్సారెడ్డి తనది తప్పు లేనప్పటికీ ఎదుటివారి బాధను చూడలేక వారికి ఆర్థిక సహాయం ఐదు లక్షల రూపాయలు అందజేశారు.
ఆసుపత్రి బిల్లు చెల్లించి వారిని ఆదుకున్నాడు. మృతి చెందిన లక్ష్మీ కుటుంబీకులు అనుకోకుండా జరిగిన సంఘటనలో కొందరు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవం లేదన్నారు. ఎటువంటి నాయకుల ప్రమేయం లేదన్నారు. బాధిత కుటుంబీకులు నర్సారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.