ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి

కామారెడ్డి, డిసెంబరు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి సత్వర పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 72 ఫిర్యాదులు, వినతులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »