డిచ్పల్లి, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధవారం షబ్బీర్అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని విద్యా నగర్ కాలనీకి చెందిన గుండ్రెడ్డి కరుణాకర్ రెడ్డికి ఆక్సీజన్ అందజేశారు.
కరోనా వ్యాధితో బాధపడుతూ దవాఖాన లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా యున్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరం ఏర్పడింది.
ఆయన కుటుంబ సభ్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి రెండు ఆక్సిజన్ సిలిండర్లు పంపించి, ఆక్సిజన్ అందించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తాము ఆపదలో ఉన్న సమయంలో ఆక్సిజన్ పంపించిన షబ్బీర్ అలీ దేవుడని, ఆయనకు తాము ఎల్లవేళలా రుణపడి ఉంటామని, సమయానికి ఆక్సిజన్ పంపించిన షబ్బీర్ అలీకి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.