ఆర్మూర్, డిసెంబరు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతీ సంవత్సరం 17 డిసెంబర్ రోజు జరుపుకునే పెన్షనర్స్ డే ను ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ అందరి ఆరాధ్యదైవం కీర్తి శేషులు డి.ఎస్ .నకారాను స్మరించుకొని నివాళులర్పించారు. జిల్లా పెన్షనర్స్ డే వేడుకల సందర్భంగా ఈ నెల 17 న జరుపుకోవాల్సిన వేడుకలను ఆర్మూర్ డివిజన్ స్థాయిలో సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.
ఇందులో 8 మంది సీనియర్ ఉపాధ్యాయులను శాలువలు, పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. విశిష్ట అతిథులు జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం మాజి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు రాంరెడ్డి మాట్లాడుతూ పెన్షనర్స్ శేష జీవితం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ, సంతోషాలతో అనునిత్యం ఆనందమయంగా గడవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి గంగారాం, కార్యవర్గ సభ్యులు, పెన్షనర్స్ పాల్గొన్నారు.