రెంజల్, డిసెంబరు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలకేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం మెథమేటిక్స్ డే సందర్భంగా సైన్స్ పేర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మెథమేటిక్స్ మేథడ్‌లో తయారు చేసిన పలు వస్తువులు, అకృతులు ప్రదర్శించారు.
విద్యార్థులు వారి మేధస్సు ఉపయోగించి తయారు చేయడం అంటే వారిలో దాగివున్న సృజనాత్మక ఆలోచనలు బయటకు తీసినవారినమౌతామని ప్రిన్సిపాల్ బలరాం అన్నారు. మాథమేటిక్స్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌లో గణిత శాస్త్ర విజ్ఞానం గురించి వస్తూ ప్రదర్శన నిర్వహించారు.
గణిత శాస్త్రం ఆవశ్యకతను చాటిచెప్పేలా వేసిన ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చైర్మన్ నాగరాజు, ఉపాధ్యాయులు సురేష్, సుష్మ, శ్రీనివాస్, సౌమ్య, విద్యార్థులు పాల్గొన్నారు.