నిజామాబాద్, డిసెంబరు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో సమ్మె చేస్తున్న సివిల్ సప్లై కార్మికుల సమ్మె శిబిరాన్ని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై కార్పోరేషన్‌లో పనిచేస్తున్న హమాలీ స్వీపర్ కార్మికులు సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు.
గత సంవత్సర క్రితం కార్మికుల నూతన రేట్లు వేతనాలు అమల్లోకి రావలసిన ఉన్న ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ రాకపోవడంతో సంవత్సర కాలంగా అధికారుల చుట్టూ, మంత్రి చుట్టూ తిరిగి విసిగి వేసారి సమ్మెకు దిగిన ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఎన్నికల పేరు మీద ప్రభుత్వ భవనాల కూల్చివేతల పేరు మీద వేల కోట్ల రూపాయలు వృధా చేసే ప్రభుత్వం కష్టం చేసే కార్మికులకు వేతనాలు పెంచమంటే పెంచకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.
ఇప్పటికైనా స్పందించి ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం జీవో ఇచ్చి అమలు చేయని పక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పోరేషన్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దేవేందర్, వాజిద్, కైసర్, మురళి, చంద్ర కార్మికులు తదితరులు పాల్గొన్నారు.