కామారెడ్డి, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి పట్టణంలోని 18వ వార్డులో రోడ్లను, మురుగు కాలువలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ బుధవారం పరిశీలించారు.
రోడ్లకు ఇరువైపుల మురుగు కాలువలను పూడిక తీయించి శుభ్రపరచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటాలని సూచించారు.
కొత్తగా అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. ఇందిరాగాంధీ స్టేడియం చుట్టూ మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వేంకటేశ్ ధోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.