నూతన పట్టాదారులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలంలో ఈనెల 20వ తేదీ లోపు నూతన పట్టాపాస్‌ బుక్‌ పొందిన రైతులందరూ జనవరి 7వ తేది లోపు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజు గౌడ్‌ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి 10 వ విడుత రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీకి ఏర్పాట్లు చేయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ఆదేశాలు ఇచ్చి రాష్ట్ర రైతాంగానికి శుభవార్త అందించిన తరుణంలో నూతనంగా పట్టా పాస్‌ బుక్‌ పొందిన రైతులందరూ జనవరి ఏడవ తేదీ లోపు దరఖాస్తు ఫారం నింపి నూతన పట్టా పాస్‌ పుస్తకం లేదా తహాశీల్దార్‌ డిజిటల్‌ సంతకం చేసిన పత్రం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, బ్యాంక్‌ ఖాతా, సంబంధిత ధ్రువపత్రాలు క్లస్టర్‌ పరిధిలోని ఏఈఓలకు అందించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ప్రస్తుతం రైతుబంధు పంట పెట్టుబడి సాయం పొందుతున్న రైతులందరికీ యధావిధిగానే రైతుబంధు సాయం వారి ప్రస్తుత అకౌంట్లోనే నేరుగా జమ అవుతాయన్నారు. రైతులేవరైనా ఇదివరకే రైతుబంధుకు అనుసంధానం వున్న బ్యాంక్‌ అకౌంట్‌లను మార్చుకోవాలని అనుకుంటే త్వరగా సంబంధిత క్లస్టర్‌ పరిధిలోని రైతు వేదికలో నూతన బ్యాంక్‌ ఖాతాను ఏఈఓలకు అందించాలన్నారు.

ప్రతి ఏడాది రెండు సీజన్లలో ఎకరాకు రూ 10 వేల చొప్పున అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. యాసంగి పంట కాలానికి పెట్టుబడి సాయం అందిస్తున్న రైతు భాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రభుత్వ విప్‌ గంప గోవర్థన్‌కు మండల రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »