ఎడపల్లి, డిసెంబరు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంతో పాటు ఏఆర్పి క్యాంప్, జానకంపేట్, పోచారం, ఎమ్మెస్సీ ఫారం, వడ్డేపల్లి, అంబం గ్రామాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని బేతానియా ఫెలోషిప్ చర్చితో పాటు ఆయా గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు.
ఏసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలను ఆదివారం క్రైస్తవ సోదరీ సోదరీమణులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు ఏసు క్రీస్తును స్తుతిస్తూ భజనలు చేశారు. ఈ మేరకు చర్చి పాస్టర్ తిమోతి రాజు బైబిల్ లో ఉన్న క్రీస్తు జన్మ విశేషాలను భక్తులకు వివరించారు.యేసు క్రీస్తు మహిమలను వారికి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం క్రైస్తవులకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు దుస్తులు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాడి పంటలు బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లోని చర్చ్‌లకు వెళ్లి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.