బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌

నవీపేట్‌, డిసెంబరు 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌ను నియమిస్తు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్‌కు నియమాక పత్రం అందచేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీకాంత్‌ విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో క్రియాశీలకంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేశారని, ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకర్తగా పని చేస్తు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొని అనేకసార్లు జైలుకు కూడా వెళ్లారన్నారు.

నిజామాబాద్‌ జిల్లా విద్యార్థి లోకానికి సుపరిచితుడు అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి శ్రీకాంత్‌ను పార్టీ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినట్లు రాజశేఖర్‌ తెలిపారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పజెప్పినటువంటి బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహిస్తానని యువమోర్చను జిల్లాలో పటిష్టం చేయడం కోసం తన వంతు సాయ శక్తుల పనిచేస్తానని తెలిపారు.

నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌, రాష్ట్ర కార్యదర్శి పల్లే గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మినర్సయ్య, బీజేపీ, బిజేవైయం జిల్లా, రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »