సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌, డిసెంబరు 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు అర్వింద్‌ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి బోర్డు సభ్యులుగా లోక్‌సభ ఎంపీలు అర్వింద్‌ ధర్మపురి, బాలశౌరి వల్లభనేనిలు ఎన్నికైనట్లు పార్లమెంట్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్‌ కేంద్రంగా రీజినల్‌ ఆఫీస్‌ కం ఎక్స్టెన్షన్‌ సెంటర్‌ మంజూరు చేసిందని, దాని ద్వారా బోర్డు 30 కోట్ల బడ్జెట్‌ను 2022-2025 మధ్య మూడేళ్ల కాలానికి ఆమోదించిందని, 1986 నుండి 2020 వరకు 35 ఏళ్లలో కూడా రానటువంటి బడ్జెట్‌ను ఈ మూడేళ్ల కాలానికే తెచ్చుకున్నామని, అందులో నుండి ఇదివరకే 9 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని పేర్కొన్నారు.

బోర్డు సభ్యునిగా ఎన్నికవ్వడం పట్ల ఎంపీ స్పందిస్తూ దీనివలన నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ప్రాంత పసుపు రైతులకు మరింత సేవ చేసే అవకాశం లభించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పసుపు, మిర్చి పంటల రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మరింతగా కృషి చేస్తానని ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. బోర్డు సభ్యునిగా తన ఎన్నికకు సహకరించిన అందరికీ ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ ధన్యవాదాలు తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »