సొంత బ్యాంక్ భవనాన్ని నిర్మించుకోవాలి

డిచ్‌ప‌ల్లి, జూన్ 17

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ను గురువారం ఉదయం ఆయన చాంబర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (నిజామాబాద్, అదిలాబాద్) మన్యం శ్రీనివాస్ టీయూ బ్రాంచ్ మేనేజర్ పవన్ ప్రసన్న కుమార్ కలిసి పుష్పగుచ్చంతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వీసీ ఎ జి ఎం తో మాట్లాడుతూ… ఆడిట్ వారి సూచనల ప్రత్యేకంగా సొంత బ్యాంక్ భవనాన్ని నిర్మించుకోవాలని అభిప్రాయపడ్డారు. అదే విధంగా తెలంగాణ విశ్వవిద్యాలయం హెల్త్ కేర్ సెంటర్ కోసం అంబులెన్స్ ప్రదానం చేయాలని అభ్యర్థించారు. ఈ రెండింటిపై ఇంతకు పూర్వం ఎ జి ఎం కు సమర్పించిన ప్రతిపాదనల గూర్చి వివరించారు.

సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ఎ ఇ వినోద్ కుమార్, ఎ ఆర్ సాయాగౌడ్, సూపరింటెండెంట్ భాస్కర్, ఇ డి పి సెక్షన్ అడిషనల్ కంట్రోలర్ డా. అథిక్ సుల్తాన్ ఘోరి, పి ఆర్ ఓ డా. త్రివేణి పాల్గొని టి యు ఎస్ బి ఐ బ్యాంక్ లావాదేవీల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఎ జి ఎం కు వెల్లడించారు.

వీసీ సన్మాన కార్యక్రమంలో ఎస్ బి ఐ బ్యాంక్ సిబ్బంది నాగేశ్వ‌ర్ రావు, సాగర్ బాబు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »