మౌనికను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు

కామారెడ్డి, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఢల్లీి పార్లమెంట్‌ హాల్లో జరిగిన యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమంలో ప్రసంగించిన జిల్లా విద్యార్థిని కేతావత్‌ మౌనికను టీఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా బృందం ఘనంగా సన్మానించింది. టిఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ముఖ్యఅతిథిగా ఇటీవల ఢల్లీి పార్లమెంట్‌ హాల్లో జరిగిన యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమంలో ప్రసంగించిన జిల్లా విద్యార్థిని కేతావత్‌ మౌనికను ఘనంగా సన్మానించారు.

జిల్లా కార్యదర్శి బి. సాయిలు మాట్లాడారు. మౌనిక యొక్క ప్రసంగం ద్వారా తెలంగాణ కీర్తి భారతదేశానికి చాటి చెప్పిందని తెలిపారు. మునుముందు పార్లమెంట్లో ప్రసంగించిన విధంగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడానికి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరారు. జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్‌ రెడ్డి మాట్లాడారు. విద్యార్థిని మౌనిక ప్రసంగం ద్వారా చాలామంది ఆడపడుచులు, విద్యార్థినిలు స్ఫూర్తి చెందారని, కుమారి మౌనిక కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి అవడం అందరికీ గర్వకారణమని కొనియాడారు.

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే మాట్లాడారు. కుమారి మౌనిక పార్లమెంట్‌ భవనంలో ప్రసంగించడం చాలా సంతోషానికి గురి చేసిందని, ఇందుకు ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. మౌనిక మునుముందు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »