రెంజల్, డిసెంబరు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పథకం నియమ నిబంధనల పాటించాలని తహసిల్దార్ రాంచందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల ఎంపిక చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని తహసీల్దార్ రాంచందర్ సూచించారు.
మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిని తొలగించడం జరిగిందని గత నాలుగు నెలలుగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సరైన విదంగా అమలు కాలేదని వారిని తొలగించి,వారి స్థానంలో నూతనంగా ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపికైన ఏజెన్సీ సభ్యులు ప్రభుత్వం మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని అన్నారు.
మెహర్ బాబా మహిళా సంఘం నుండి సావిత్రి, త్రివేణి మహిళా సంఘం నుండి లక్ష్మీ లను ఎంపిక చేసినట్టు తహసిల్దార్ రాంచందర్, సర్పంచ్ రమేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో మహిళ సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీ, ఎంఈఓ గణేష్ రావు, ఏపిఎం చిన్నయ్య, మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి సుజాత, ఐకెపి సీసీలు శ్యామల, భాస్కర్, కృష్ణ, సునీత, రాజయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.