నిజామాబాద్, డిసెంబరు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నిజామాబాద్ పోలీసు కమీషనర్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో భాగంగా పలు సూచనలు చేశారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని నిజామాబాద్ పోలీసు కమీషనర్ కె.ఆర్. నాగరాజు హెచ్చరించారు. శుక్రవారం కమీషనరేట్ నుండి ప్రకటన ద్వారా సూచనలు వెల్లడిరచారు.
క్రాకర్స్, ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్, డిజె ఏర్పాట్లు నిషేదం, ట్రాఫిక్ నిబంధనలు కమీషనరేట్ పరిధిలో ప్రతి వ్యక్తి పాటించాలని, కూడల్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్లపై గస్తీ
నిర్వహించబడతాయని, సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యేక పోలీసు బృందాలు వాహనాలు తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారని అన్నారు. డ్రంక్ చేసి వాహనాలు
నడిపిన వారిపై కేసులు నమోదు చేయబడతాయన్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రజలు తమ తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని సూచించారు.
గుంపులు గుంపులుగా తిరగరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దన్నారు. మైనర్లు, యువకులకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నందున మైనర్ బాలల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయబడతాయన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం వల్ల పోలీసు కేసులు నమోదు చేస్తామన్నారు. గుంపులు గుంపులుగా వాహనాలపై కేసులు వేస్తు తిరగడం, ర్యాలీలుగా వెళ్లడం చేస్తే కేసులు విధించబడతాయని, కావున జిల్లా ప్రజలు పోలీసు సూచనలు తప్పక పాటిస్తు ఆనంద ఉత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు.