నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలాషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని, ఎల్లవేళలా మంచి జరగాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని, ఇదే స్పూర్తితో కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ జిల్లాను మరింత వడివడిగా ప్రగతి పథాన పయనింపజేసేందుకు కలిసికట్టుగా కృషిని కొనసాగిద్దామని భవిష్యత్లో ఇదే ఒరవడిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

2022 లో ఎదురైన అనుభవాలను సానుకూలంగా మల్చుకుని, 2023 నూతన సంవత్సరంలో మరింత పట్టుదల, అవిరళ కృషితో ఎలాంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొని విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి గెలుపునందించే సంవత్సరం కావాలని కోరుకుంటూ జిల్లా ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »