పెద్ద మొక్క‌లు నాటి ప‌చ్చ‌ద‌నం పెంపొందించాలి

కామారెడ్డి, జూన్ 17

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రోడ్లకు ఇరువైపులా మూడు వరుసలలో మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.

కామారెడ్డి మండలం గర్గుల్ లో అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, పాఠశాల ప్రకృతి వనం, ఆక్సిజన్ పార్క్, కంపోస్ట్ షెడ్డు, స్మశాన వాటిక, నర్సరీని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …రోడ్లకు ఇరువైపులా పెద్ద మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. నాటిన మొక్కలకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించి వారికి కావాల్సిన ఆరు మొక్కలను రిజిస్టర్లో నమోదు చేసి, వాటిని అందజేయాలని పేర్కొన్నారు. నర్సరీలో మునగ, కరివేపాకు, కృష్ణ తులసి, బాదం, వేప, చింత మొక్కలను పెంచాలని కోరారు.

మియావాకి విధానంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మంకీ ఫుడ్ కోర్టులో నేరేడు, చీమ చింత, జువ్వి, రావి, మామిడి, జామ మొక్కలను నాటాలని చెప్పారు. కంపోస్ట్ షెడ్డు, స్మశాన వాటిక చుట్టూ రక్షణ గా గ్రీన్ ఫినిషింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాల ప్రకృతి వనంలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలన్నారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను పక్కాగా రిజిస్టర్లో నమోదు చేయాలని కోరారు. పచ్చదనంతో గ్రామం రూపురేఖలు మార్చాలని పేర్కొన్నారు.

మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందే విధంగా చూడాలన్నారు. రక్షిత నీటి ట్యాంకు క్లీన్ చేసిన వివరాలు బోర్డుపై నమోదు చేయాలన్నారు. మురుగు కాలువలు శుభ్రం చేయాలని కోరారు. డివిజన్ స్థాయి అధికారులను పారిశుద్ధ్యం, తాగునీరు, అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, కంపోస్టుషెడ్, వైకుంఠధామం నిర్వహణ పక్కాగా చేపట్టే విధంగా చూడాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎంపీపీ ఆంజనేయులు , డీఎల్పీవో సాయిబాబా, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎ పి వో రజని, సర్పంచ్ రవితేజ గౌడ్, ట్రాన్స్కో అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »