కట్టుదిట్టమైన భద్రత నడుమ మరమ్మతు పనులు

నిజామాబాద్‌, జనవరి 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎం లు, బ్యాలెట్‌ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్‌, అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్లు, ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గోడౌన్‌ లోనే పూర్తి స్థాయిలో సదుపాయాలు కలిగి ఉన్న గదుల్లో భద్రపర్చాలని, ఏ చిన్న వస్తువు కూడా బయటకు వెళ్లకుండా నిఘా ఉంచాలన్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌ కు ఆస్కారం లేకుండా నాణ్యమైన సామాగ్రిని వినియోగిస్తూ, విద్యుత్‌ సంబంధిత పనులను పక్కాగా జరిపించాలన్నారు. వచ్చే ఆదివారం నాటికి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. మరమ్మతు పనుల్లో పాల్గొనే వారి పూర్తి వివరాలు సేకరించాలని, ఆధార్‌ జిరాక్స్‌, సెల్‌ ఫోన్‌ నెంబర్‌ తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, పంచాయతీ రాజ్‌ ఈ.ఈ శంకర్‌ రాథోడ్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »