ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, జనవరి 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు.

సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అర్జీలను పెండిరగ్‌ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 61 ఫిర్యాదులు, వినతులు వచ్చాయన్నారు.

ప్రజావాణిలో శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, డిఆర్డిఓ సాయన్న, ఏవో రవీందర్‌, జిల్లా అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »