జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం

కామారెడ్డి, జనవరి 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం అందిస్తామని రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లోనీ కోర్టు ప్రాంగణాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్వల్‌ భుయాన్‌ మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా పేద ప్రజలు, ఒంటరి మహిళలు, నిరక్ష్యరాస్యులు ఆర్థికంగా వెనకబడిన వారికి ఉచిత న్యాయ సలహా దొరుకుతుందన్నారు. ఉచితంగా సేవలు అందుతాయనే విషయం అందరికీ తెలియజేయాలని అన్నారు. దేశంలోని ప్రతి మహిళకు, ఎస్సి, ఎస్టిలకు, కార్మికులకు, దివ్యాంగులకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం పొందే హక్కును కల్పించడం జరిగిందని, ఇది పూర్తి స్థాయిలో అమలు అయ్యేందుకు 1995లో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేశారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాల్లో జిల్లాస్థాయి న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయని, ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలలో సైతం జిల్లా స్థాయి న్యాయాధికార సేవా సంస్థలను ఏర్పాటు చేయడంలో సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా న్యాయ అధికార సేవా సంస్థల ద్వారా అందించే సేవలను విస్తృతంగా ప్రచారం చేయాలని, పేద ప్రజలు సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీదేవి మాట్లాడారు. కక్షిదారులు అందరూ తమ సమస్యలను న్యాయ సేవాదికార సంస్థను సంప్రదించి పరిష్కరించుకోవచ్చని, సంస్థ సేవలను, అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, శిక్షణ కలెక్టర్‌ శివేంద్రప్రసాద్‌, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »