జనవరి 5న తుది జాబితా విడుదల చేస్తాం

కామారెడ్డి, జనవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 5న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల అబ్జర్వర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 1 నుంచి 8 ఫార్మాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

జిల్లాలో83.19 శాతం ఓటర్లది ఆధార అనుసంధానం చేశారని పేర్కొన్నారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల నిర్వహణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. జిల్లాలో 790 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. యువతి, యువకులు ఎక్కువమంది కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకున్నారని చెప్పారు.

అంతకుముందు ఎన్నికల అబ్జర్వర్‌ మహేష్‌ దత్త ఎక్కా కు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, ఆర్డీవోలు శ్రీనివాస్‌ రెడ్డి, శీను, ఎన్నికల సూపర్డెంట్‌ సాయి భుజంగరావు, తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »