రెంజల్, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యాబోధనను సమర్థవంతంగా నిర్వహించుటకు అన్ని స్థాయిలలోని విద్యార్థులల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే బోధనోపకరణాల మేళ ఉపయోగపడతాయని ఎంపీపీ రజిని కిషోర్ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్ భవిత దివ్యాంగుల పాఠశాలలో బోధనోపకరణమేలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు.
విద్యార్థులు వారి ప్రతిభతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కిలకించారు.అనంతరం వారు మాట్లాడుతూ. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని ఇటువంటి ప్రదర్శన ద్వారా విద్యార్థులకు మరింత విషయపరిజ్ఞానం మెరుగుపడుతుందన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్‌లు వికార్ పాషా, రమేష్ కుమార్, సాయిలు, మధురబాయి, శ్రీదేవి కిష్టయ్య, ఎంఈఓ గణేష్ రావ్, పిఆర్టియు అధ్యక్ష్యకార్యదర్శులు సోమలింగం గౌడ్, సాయరెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, ఉపాద్యాయులు కృష్ణమూర్తి, రాజు, అరుణ్, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్, గంగాధర్, విశ్వనాథన్, విజయ్ తదితరులు ఉన్నారు.