కామారెడ్డి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయంలో అంధుల అక్షర ప్రదాత లూయిస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైన్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ హాజరై నివాళులర్పించి మాట్లాడుతూ ఎంతోమంది అంధుల జీవితాల్లో వెలుగును పంచిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు.
అతిథులుగా వచ్చిన వారికి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా శిశు, మహిళ, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి రమ్య, మెప్మా అధికారి శ్రీధర్, మానవ హక్కుల సంక్షేమ సంఘం జాతీయ సభ్యులు రమేష్ బాబు, గోపికృష్ణ, ప్రదీప్తి, ప్రముఖ సింగర్ భిక్షు నాయక్, జాతీయ అంధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు హరి సింగ్, సెవెన్ హాట్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ జీవన్ నాయక్, సాయిలు, పలువురు పాల్గొన్నారు.