హైదరాబాద్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిసి సంక్షేమం మరియు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి, బుధవారం కరీంనగర్లో వారి నివాసంలో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న సిఎం కేసీఆర్ మంత్రి గంగులకు ఫోన్ చేసి పరామర్శించారు, విచారం వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయిన బాధలో వున్న గంగులను సిఎం కెసిఆర్ ఓదార్చి, వారికి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్య ఆత్మకు శాంతిని చేకూర్చాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.