నిస్వార్ధ రక్తదానం అభినందనీయం…

కామారెడ్డి, జనవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు.

ఆయన వెంటనే స్పందించి మాచారెడ్డి మండలం లచ్చపేట్‌ గ్రామానికి చెందిన భూస రాజుకు తెలియజేయగానే ఆయన వెంటనే ములుగు కేంద్రంలో గల ఆర్విఎం వైద్యశాలకు వెళ్లి ఓ నెగటివ్‌ రక్తాన్ని 5వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటడం జరిగిందని రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త బాలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుండి అత్యవసర పరిస్థితులలో రక్తం అవసరం ఉన్నవారికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని రక్తదాతల సహకారంతో అందజేయడం జరుగుతుందని, రక్తదానం చేసిన రక్తదాత బూస రాజుకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా మరియు జిల్లా కలెక్టర్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా అధ్యక్షులు జితేష్‌ వి పాటిల్‌ తరఫున అభినందనలు తెలిపారు. రక్తదానం చేయాలనుకునేవారు వారి వివరాలను 9492874006 నెంబర్‌ కి తెలుపగలరని కోరారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »