నిజామాబాద్, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కోసం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వెళ్లిన న్యాయవాది గణపతిని కోర్టు సిబ్బందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ శుక్రవారం అత్యవసర సమావేశమై పోలీసులు అక్రమ కేసులను నమోదు చేయదాన్ని తీవ్రంగా ఖండిరచింది.
ఈ సంఘటనను నిరసిస్తూ న్యాయవాదులు నిరవధికంగా విధులు బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం జిల్లా కోర్టు ఎదుట నిరసన తెలిపారు. సంఘటనకు బాధ్యులైన వారిపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయాలని అక్రమ పోలీస్ కేసులు ఎత్తివేయాలని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తమ ఆందోళన ఉదృతం చేస్తామని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, న్యాయవాది పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు.