నవీపేట్, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యంచ గోదావరి నదిలో దూకి ఇరిగేషన్ డి.ఈ.ఈ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్. ఐ. రాజిరెడ్డి తెలిపారు. ఎస్.ఐ, స్థానికుల సమాచారం ప్రకారం మండలంలోని పోతంగల్ గ్రామానికీ చెందిన రమణ రావు (46) ఆర్మూర్ ఇరిగేషన్ డి.ఈ.ఈ. గా విధులు నిర్వహిస్తున్నారు.
గత యేడాది ఫిబ్రవరి15 నుండి వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టుకొని హైదరాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారని బుధవారం రోజున ఒక్కరే కారులో పోతంగల్ వచ్చి మళ్ళీ తిరిగి వెళుతున్నానని చెప్పి పల్సర్ బైక్ తీసుకొని వెళ్లి తిరిగి హైదరాబాద్ వెల్లకపోవడం తోపాటు బంధువుల ఇండ్లలో వెతికిన లాభం లేకపోవడంతో గురువారం రాత్రి మృతుని బంధువులు నవీపేట్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారన్నారు.
శుక్రవారం ఉదయం యంచ గోదావరి నది వద్ద బైక్ కనబడడంతో గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం దొరికిందని, పంచనామా అనంతరం అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి బాడీని కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు ఎస్. ఐ. పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని మృతునికి భార్య, కూతురు ఉన్నట్లు ఎస్.ఐ రాజారెడ్డి తెలిపారు.