కామారెడ్డి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 39 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 20 లక్షల 22 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1,741 మందికి 10 కోట్ల 72 లక్షల 85 వేల 300 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో ఇచ్చిన పత్రాలను సకాలంలో తమ కార్యాలయంలో అందజేసినట్లైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు ఇప్పించే విధంగా చూస్తామని తెలిపారు.