ఆర్మూర్, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ఆయన దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కంటి వెలుగుపై ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు ఆరోగ్య పర్యవేక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుండి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమంలో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి కంటి వెలుగు శిబిరానికి తీసుకువచ్చి కంటి పరీక్షలు జరిపించి తగు కళ్ళజోడిని ఇప్పించి విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్క్వాస్ బృందం సభ్యులు శివ దాస్, జై సి సువేత, వైద్యాధికారులు పూజా రెడ్డి, ప్రవీణ, రోషిని, పిహెచ్‌ఎన్ స్వరూప, హెచ్‌ఈఓలు కాంతయ్య, రవి, ఆరోగ్య పర్యవేక్షకులు సుభాష్, అజీమా, ఆరోగ్య ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.