కామారెడ్డి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 11 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ విలేకరులతో మాట్లాడారు.
కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడలిలో వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ వివరాలను తెలియజేశామన్నారు. మీడియా ద్వారా మాస్టర్ ప్లాన్ వివరాలను వెల్లడిరచామని తెలిపారు. ఇప్పటివరకు1026 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ఫైనల్ కాలేదని సూచించారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. అభ్యంతరాలను రైతులు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో తెలియజేయవచ్చని తెలిపారు.
రైతులు ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. డ్రాఫ్ట్ లో మార్పులు, చేర్పులు చేసే వీలు ఉందని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ ఏరియా డ్రాఫ్టు ఇది ప్రతిపాదన మాత్రమేనని, రైతులు అపోహలకు గురి కావద్దన్నారు. 2000 సంవత్సరంలో పాత మాస్టర్ ప్లాన్ తయారు చేశారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేశారని, అక్కడ ఇంతవరకు ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పలేదని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే పాల్గొన్నారు.