కామారెడ్డి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆల్ ఇండియా అడ్వకేట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఢల్లీిలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ చేతుల మీదుగా బాన్సువాడకు చెందిన షేక్ షార్జిల్ పురస్కారాన్ని అందుకున్నారు.
జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం కుమారుడు షేక్ షార్జీల్ కరోనా సమయంలో పేద విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా తరగతులు బోధించారు. శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను షేక్ షార్జీల్ కలిశారు. కలెక్టర్ ఆయనను అభినందించారు. పాత బాన్సువాడలోని శాంతినగర్ కాలనీకి చెందిన షేక్ షార్జీల్ గత మూడు ఏళ్లుగా ఢల్లీిలో సివిల్స్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు.