కామారెడ్డి, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గ్రామాలలో చేపట్టిన ప్రగతి పనుల నివేదికలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.
సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో శుక్రవారం అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను పరిశీలించారు. సదాశివనగర్, రామారెడ్డి ఆర్అండ్‌బి రోడ్డు వెంట రెండు వరుసలలో మొక్కలు నాటాలని సూచించారు.
పాదులు చక్కగా ఉండే విధంగా చూడాలన్నారు. కంపోస్టు షెడ్లు, స్మశాన వాటికలు వాడుకలోకి వచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం లో వంద శాతం మొక్కలు ఏపుగా పెరిగే విధంగా చూడాలన్నారు.
గ్రామాల్లోని మురుగు కాలువలను శుభ్రపరిచి స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలని పేర్కొన్నారు. ఏడో విడత హరితహారం ని విజయవంతం చేయాలని కోరారు. నర్సరీలలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలన్నారు.
నర్సరీలలో మునగ, కరివేపాకు, నిమ్మ, బాదం, కృష్ణ తులసి, నేరేడు, జామ, మామిడి, సపోటా వంటి మొక్కలను పెంచాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఉపాధి హామీ ఏపిడి సాయన్న, సదాశివనగర్, రామారెడ్డి సర్పంచులు బద్దం శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్, ఎంపీడీవోలు రాజు వీర్, విజయ్ కుమార్, ఏ పీ ఓ సవిత, కార్యదర్శులు పాల్గొన్నారు.