కామారెడ్డి, జనవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నడంతో వారికి కావలసిన ఏ నెగిటివ్ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాల్లో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆరోగ్య విస్తరణ అధికారి చలపతికి తెలియజేయగానే మానవత దృక్పథంతో వెంటనే స్పందించి 21వ సారి రక్తాన్ని వి.టి. ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో అందజేశారన్నారు. రక్తదాత చలపతి గతంలో ఎన్నోసార్లు కామారెడ్డితో పాటుగా హైదరాబాదులో వివిధ ఆపరేషన్ల నిమిత్తమై రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం అభినందనీయమని రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీల తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్, టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.