నిజామాబాద్, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ లోని వినాయకనగర్, గాయత్రీ నగర్ నుండి రేడియో స్టేషన్ మీదుగా నాగారం వరకు ప్రతిపాదించిన 100 ఫీట్స్ రోడ్డును సర్వే చేయాలని మాస్టర్ ప్లాన్ బాధితుల కమిటీ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ నారాయణ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ప్రతిపాదిత రోడ్డు ఏ సర్వే నంబర్ల, ప్లాట్స్ గుండా పోతుందో, అర్థం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారని, ఇల్లు కట్టుకోవటానికి ముందుకొచ్చిన వారికి సర్వే చేయడం మూలంగా పర్మిషన్ తీసుకొని ముందుకెళ్లేందుకు అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇట్లా రోడ్డును 100 ఫీట్ల రోడ్డును సర్వే చేసి హద్దులు పాతాలని కన్వీనర్ కే రామ్మోహన్రావు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో విజయకుమార్, రాములు, రాజు, రామ్ చందర్, పుండరీ, గంగాధర్, తదితరులు ఉన్నారు.