బీర్కూర్, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలకేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పూర్వ అధ్యక్షలు, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ 51వ జన్మదినం సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అహ్మద్ ఆధ్వర్యంలో డాక్టర్ రవిరాజాతో కలిసి రోగులకు, గర్భిణులకు బ్రేడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ కాలనిలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అహ్మద్ మాట్లాడుతూ గత సంవత్సరం నుండి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పూర్తిగా రద్దు చేసుకుని కరోనాను కట్టడి చేయడంలో భాగంగా పని చేస్తున్నటువంటి ఆరోగ్య సిబ్బందికి, కరోనా తో పోరాడుతున్న కుటుంబాలను ఆదుకోవడం, కరోనాతో పోరాడి ప్రాణాలను వదిలిన కుటుంబాలను పరామర్శించడం, ప్రజలకు అన్నదానం, మెడికల్ కిట్లు, సానిటైజర్లు పంపిణి చేయాలనే పిలుపుతో దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
దేవుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి వారి మనో వాంఛను నెరవేర్చాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సానెపు గంగారాం, అహ్మద్ హుస్సేన్, అమీన్,నారం హన్మాండ్లు, ఇస్తరాకుల సాయన్న, జహంగీర్, ప్రభు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.