రెంజల్, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్రాంత్రి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటడంతో పాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన ప్రతి సంక్షేమ పథకాలు ముగ్గుల రూపంలో తెలియపరచిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా సోమవారం రెంజల్ మండల కేంద్రంతో పాటు కందకుర్తి గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు.
మహిళలు వేసిన ముగ్గులను ఆమె పరిశీలించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే షకీల్ అమీర్‌ల చిత్రపటాలను ముగ్గుల రూపంలో ఆకట్టుకున్నాయి. ఆవరణలో వేసిన ముగ్గులు తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు రంగవల్లులుగా వేసి తెలియపరచిన మహిళలను ప్రత్యేకంగా అభినందించారు.
గత ఐదు సంవత్సరాల నుండి బోధన్ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళల కోసం ముగ్గుల పోటీలను నిర్వహించి పండుగ ప్రాధాన్యతను విస్తరింప చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ప్రాతిమను సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు.
కార్యక్రమంలో సర్పంచులు రమేష్ కుమార్, కలీంబేగ్, వికార్ పాషా, వాణిసాయిరెడ్డి, ఎంపీటీసీలు అజ్మత్ ఉన్నిసా బేగం, అసాద్ బేగ్, లత భూమేష్, స్వప్న రాంచందర్, సొసైటీ చైర్మన్ ఇమాంబేగ్, మండల అధ్యక్షుడు భూమారెడ్డి, మహిళసమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీ, ఏపిఎం చిన్నయ్య, నాయకులు రఫిక్, ఆసాని అనిల్, రాందాస్, ప్రభాకర్, శ్రీకాంత్, ముఖిద్, షబ్బీర్, ఐకెపి సిసిలు శ్యామల, సునీత, రాజయ్య, కృష్ణ, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.