పండగ పూటా ఆగని నిరసనలు

కామారెడ్డి, జనవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌ వల్ల నష్టపోతున్న రైతులు గత 40 రోజులుగా చేస్తున్న ఉద్యమం సంక్రాంతి పండగ రోజు కూడా ఆగలేదు. రైతులకు నష్టం చేసే మాస్టర్‌ ప్లాన్‌ ను వెంటనే రద్దు చేయాలని రైతులు, కుటుంబంతో సహా వచ్చి రోడ్ల పై ముగ్గులు వేసి, రోడ్లపై తమ బాధలను రాసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్‌ ప్లాన్‌ వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గత 40 రోజులుగా ఉద్యమం చేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పండగ రోజు కూడా నిరసన తెలపాల్సిన అవసరం వచ్చిందని, భూముల విషయంలో స్పష్టత వచ్చే వరకు ఉద్యమం ఆగదని అన్నారు.

విలీన గ్రామాల కౌన్సిలర్లు 20 వ తేదీ వరకు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేసి రైతులకు మద్దతు పలకాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 17 వ తేదీన పాత రాజంపేట గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »