అంత్యక్రియలు నిర్వహించిన ఆడబిడ్డ
కామరెడ్డి, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల కేంద్రంలోని ఉప్పల్వాయి గ్రామంలో మంగలి రామచంద్రం (52) వృత్తిరీత్యా మంగళి పని చేసేవాడు. అనారోగ్యంతో గత వారం రోజులుగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతనికి మగ బిడ్డలు లేకపోవడంతో వారి ఆడ బిడ్డ భాగ్యలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించింది.
ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన ఎల్లన్న వారి ఆవేదన చూసి ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట ఆకులు లింగం, సంకి శివరాజ్, సంకి లింగం, బాలాజీ, నర్సయ్య, యాదగిరి, సాయిలు, సాకలి రాజు, వారు కూడా తమకు తోచినవిధంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.