కామారెడ్డి, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా ప్రకటిస్తానని మాట ఇవ్వడం జరిగిందని, 2018 ఎన్నికల్లో మెడికల్ కళాశాలతో పాటు దక్షిణ ప్రాంగణంలో నూతన కోర్సులను కూడా తీసుకు వస్తానని స్వయంగా మాట ఇచ్చారని ఇచ్చిన మాటకు కట్టుబడి వాటిని నెరవేర్చాలని జిల్లా ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బాలు, టిజెఎస్ కామారెడ్డి జిల్లా ఇంచార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడారు.
కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆధీనంలో 120 ఎకరాలకు పైగా భూములు నిరుపయోగంగా ఉన్నాయని వాటిలో నూతన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇదే విషయాన్ని గతంలో కెసిఆర్ కామారెడ్డి పర్యటనలో స్వయంగా తెలియజేయడం జరిగిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్ యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సుధీర్, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చెట్టబోయిన స్వామి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, టిఎన్‌ఎస్‌ఎఫ్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆకుల శివకృష్ణ, రాజు, నవీన్ లతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.