కామారెడ్డి, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 25న జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు సీనియర్ సిటిజన్ ఫోరం, దివ్యాంగుల సంఘం ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించాలన్నారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. డివిజన్ కేంద్రాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి, శీను, జిల్లా ఎన్నికల సూపరిండెంట్ సాయి భుజంగరావు, కామారెడ్డి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, అధికారులు పాల్గొన్నారు.