కామారెడ్డి, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ గా పెరుగు వెంకటేశ్వర్ నియమితులయ్యారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మెడికల్ కళాశాల తరగతులు వచ్చే విద్యా సంవత్సరం నిర్వహించడానికి ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని చూడాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్‌కు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకురాలు విజయలక్ష్మి, వైద్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.