మోర్తాడ్, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేసిందని, ప్రజలు అశ్రద్ధ వహించరాదని, కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పదని, రాష్ట్రంలో కరోన మహమ్మారి పూర్తిగా సమసిపోలేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ప్రతినిత్యం మాస్కులు ధరించడం తప్పనిసరిగా శానిటైజర్ వాడాలని ప్రజలు గుమికూడి ఉండరాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు వివిధ పనులపై బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరిస్తూ తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయిలో తగ్గేవరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లేనిచో కష్టాలు పడవలసి వస్తుందని కరోనాను నిర్లక్ష్యం చేయకుండా మసలుకోవాలని సూచించారు. కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుందామని, మనమందరం సుఖ సంతోషాలతో ఉందామని అన్నారు.