నిజామాబాద్, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో కల్తీ కళ్ళు అరికట్టాలని జిల్లా కలెక్టర్‌కు సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ నగరంలో డైజోఫామ్ క్లోరోఫామ్ ఆల్ఫాజామ్ మొదలగు వాటిని కలిపి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజలను బానిసలుగా తయారు చేస్తూ తాగుబోతులుగ మారుస్తున్నారని, వేలాది లీటర్ల కల్తీ కల్లు అమ్ముతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు.
ఒకవైపు ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధిస్తుంటే వీరు మాత్రం ప్లాస్టిక్ పాకెట్‌లలో కల్లు అమ్ముతున్నారు, దీంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తినడంతో పాటు కార్మికుల జీవనోపాధి కూడా దెబ్బతీశారని వెల్లడిరచారు. సిండికేట్‌గా మారి రేట్లు పెంచి డబ్బులు దండుకుంటున్నారని విమర్శించారు. ఎక్సైజ్ అధికారులు కళ్ళు మూసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.
దీంతో ముస్తేదారులకు కన్ను మిన్ను కానరావడం లేదన్నారు. ఎక్సైజ్ అధికారులు జిల్లా అధికారులు చర్య తీసుకుని కల్తీ కళ్ళు అరికట్టాలని పెంచిన రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మేకల సాయిలు, నాగం సాయిలు, బాలయ్య, సిపిఐ దక్షిణ మండల కార్యదర్శి పాలేటి ముత్యాలు, రాకేష్, పుష్ప తదితరులు పాల్గొన్నారు.